నమో లక్ష్మీ వేంకటరమణ..
● ఆలంబగిరి రథోత్సవం
చింతామణి: తాలూకాలోని ఆలంబగిరి గ్రామంలో కొలువైన పురాణ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవం శనివారం నేత్రపర్వంగా జరిగింది. ధర్మాధికారి జయరాం దంపతులు శ్రీ కృష్ణ గంధోత్సవం సేవలను చేశారు. పండితులు రథ శాంతి, రథపూజ, హోమాలు, పూర్ణాహుతిను సమర్పించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటరమణస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో దేవస్థానంలో ఊరేగించారు. ఉత్సవమూర్తులను తేరులో ఉంచి ఊరేగించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తజనం తరలివచ్చారు.


