పాస్టర్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్‌వెస్లీ వెల్లడించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్‌ను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ వెళుతుండగా కోవ్వూరు టోల్‌గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందన్నారు. పాస్టర్ వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా పాస్టర్ తలకు బలంగా దెబ్బలు తగిలాయన్నారు. తలకు ఉన్న హెల్మెట్‌కు ఏమీ కాలేదన్నారు. పాస్టర్‌ను రాజకీయ కక్షతో హత్య చేశారని, అతని మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా వినతిపత్రం సమర్పించారు.


