6న శ్రీరామ నవమి ఉత్సవాలు
హుబ్లీ: ధార్వాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పురుషోత్తమ సభాభవనంలో ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు సంస్కార భారతి సారథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఈ ప్రచార సభ కార్యనిర్వాహక అధ్యక్షుడు వీరేష్ అంచటగేరి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సంస్కార భారతీ ఉత్తర ప్రాంత ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశిధర్ నరేంద్ర, రామాయణం ఆదర్శాల గురించి ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. అధ్యక్షురాలు సౌభాగ్య కులకర్ణి, మారుతీ ఉటగి, ప్రసాద్ మడివాళర్, భార్గవి గుడి కులకర్ణి, శిల్ప నవలిమఠ తదితరులు పాల్గొననున్నారు. సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, పలువురు ప్రముఖులు వీరణ్ణ పత్తార, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, హారతి దేవశిఖామణి తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఛత్రపతి శివాజీ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా ఆచరించారు. గురువారం మావినకెరె చెరువు వద్ద ఛత్రపతి శివాజీ చిత్రపటానికి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు బంగి మునిరెడ్డి పూలమాల వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు శివాజీ జయంతిని ఆచరించక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.


