ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగులకు బకాయి వేతనాలేవీ?
రాయచూరు రూరల్: ఒపెక్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఒపెక్ ఆస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మానసయ్య మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి ఆరు నెలల నుంచి వేతనాలు లేవన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు.
అల్లమ ప్రభు జయంతి
రాయచూరు రూరల్ : శతమాన శ్రేష్ట శరణ చింతకుడు అల్లమ ప్రభు జయంతి ఉత్సవాలను సోమవారం బసవ కేంద్రంలో ఆచరించారు. బసవ కేంద్రంలో అల్లమ ప్రభు చిత్రపటానికి కేంద్రం అధ్యక్షుడు రాచనగౌడ పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. అల్లమ ప్రభు పేదల పాలిట దేవుడని, వారి ఆకలిని తీర్చిన అన్నదాతగా చిరస్మరణీయుడన్నారు. 1645 వచనాలను రాసిన మహా మేధావి అన్నారు. ఈ సందర్భంగా శివకుమార్, చెన్నబసవ, వెంకణ్ణ, మల్లికార్జున, రాఘవేంద్రలున్నారు.
పోస్టర్ విడుదల
హుబ్లీ: ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప కార్యం మరొకటిది లేదు. తమకు చేత కాకున్నా ఉన్న వారి నుంచి అన్నాన్ని సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న కరియప్ప, సునంద శిరహట్టి దంపతులు చేస్తున్నది పుణ్య సేవ అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరళి నాగరాజ్ గంగావతి తెలిపారు. సోమవారం ఆనంద నగర్‌లో కరియప్ప శిరహట్టి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హసిదవర అన్న జోళిగె పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆ దంపతులు పేదలైన నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు ఏమైనా సాయ పడాలన్న ఉద్దేశంతో అన్న జోళిగె కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టడం ఆదర్శప్రాయం అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, అశోక్ అణ్ణిగేరి తదితరులు పాల్గొన్నారు.
ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగులకు బకాయి వేతనాలేవీ?
ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగులకు బకాయి వేతనాలేవీ?


