డీకేశి ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

డీకేశి ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం

Published Sun, Nov 26 2023 12:58 AM

మాజీ మంత్రి బీ.శ్రీరాములు  - Sakshi

మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపణ

గాలి జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరితే

స్వాగతిస్తాం

సాక్షి బళ్లారి: అసాధారణ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ తనిఖీకి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతిని వెనక్కి తీసుకోవడం సరికాదని, రాష్ట్రప్రభుత్వం డీకేశి ఒత్తిడికి తలొగ్గిందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు ఆరోపించారు. ఆయన శనివారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో శ్రీరామ అగ్రి కోల్డ్‌స్టోరేజ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జన సేవ, ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెబుతున్న ఈ ప్రభుత్వం డీకేశి అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకునిచ్చిన అనుమతిని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వ మంత్రిమండలి తీసుకొన్న నిర్ణయంపై డీకేశి చట్టప్రకారం నడుచుకోవాల్సింది పోయి ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీబీఐ తనిఖీకి అనుమతిని విరమింపజేయడం సరికాదన్నారు. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. ఆయనే కాదు పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు. బీజేపీలోకి గాలి జనార్దన్‌రెడ్డిని చేర్చుకొనే విషయంపై పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, హైకమాండ్‌ తీర్మానిస్తారన్నారు. ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే అందరూ కలికికట్టుగా ఉంటే ఎన్నికల్లో గెలవడానికి సులభంగా ఉంటుందన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement