
మైసూరులో మొబైల్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న నగరవాసులు
● అభిమానుల సందడి
బనశంకరి: క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటులో భారతదేశ జట్టు విజేతగా నిలిచి కప్‌ను కై వసం చేసుకోవాలని రాష్ట్రంలో క్రికెట్ అభిమానులు ఆకాంక్షించారు. కొందరు ఇళ్లలో, ఆలయాల్లో విశేష పూజలు కూడా నిర్వహించారు. బెంగళూరులో బనశంకరీ దేవస్థానంలో ప్రత్యేకపూజలు, హోమం నిర్వహించారు. ఆదివారం వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో బనశంకరీదేవి మూలవిరాట్ అభిషేకం, అర్చనలు చేపట్టి జాతీయపతాకం, పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారత్ విజయం కోరుతూ యాగశాలలో హోమం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతటా పూజలు
శివాజీనగర: ఆస్ట్రేలియాపై పోటీపడుతున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీలో భారత జట్టు గెలుపొందాలని ఆకాంక్షిస్తూ వివిధ భాగాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగాయి. బెంగళూరుతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు నీలిరంగు దుస్తులు ధరించి దేవాలయాలలో, వీధుల్లో పూజలు, హోమాలు నెరవేర్చారు.

ప్రజలందరూ టీవీల ముందు చేరడంతో మైసూరులో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధి


క్రికెట్ మ్యాచ్ గెలవాలని బనశంకరీ మాతకు పూజలు చేసిన దృశ్యం, ప్రపంచ కప్ నమూనాలో రంగోళి