సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

Nov 29 2026 1:59 PM | Updated on Nov 29 2026 1:59 PM

కరీంనగర్‌క్రైం: తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షుడు గోలి విప్లవ్‌రెడ్డి, జనరల్‌సెక్రటరీ, కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఫెడరేషన్‌ ప్రతినిధులు శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌ కోషీ, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సాముల రామ్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ హెల్త్‌ కార్డులు అందజేయాలని, హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సానుకూలంగా స్పందించినట్లు ఫెడరేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

రీజియన్‌ల పనితీరుపై సమీక్ష

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ పరిధిలోని రీజనల్‌ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్లతో శనివారం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పగిడిమర్రి సోలమన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ వరకు ఆపరేషన్స్‌, మెకానికల్‌ విభాగాల్లో అన్ని రీజయన్‌ల పనితీ రు, ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రీజనల్‌ మేనేజర్లు బి.రాజ, డి.వి జయభాను, ఎస్‌.భవాణిప్రసాద్‌, ఎస్‌వీజీకే మూర్తి, డిప్యూటీ ఆర్‌ఎంలు ఆపరేషన్స్‌ ఎస్‌. భూపతిరెడ్డి, ఎం.మల్లేశయ్య, డి.శ్రీహర్ష, ఎం. శ్రీనాథ్‌, పి.జ్యోతి, డిప్యూటీ ఆర్‌ఎంలు మెకా నికల్‌ పి.మల్లేశం, ఎస్‌.రామయ్య, టి.కిషన్‌రా వు, ఎ.రాజేశ్వర్‌రెడ్డి, జోనల్‌ వర్క్‌షాప్‌ వర్క్స్‌ మేనేజర్‌ ఎస్‌.ప్రణిత్‌కుమార్‌, డిప్యూటీ చీ ఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ వి.శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్యదర్శి వి.శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కొండగట్టులో నేడు ఆర్జిత సేవలు రద్దు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి నిజరూప దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని ఈవో అంజనా రెడ్డి తెలిపారు. గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌శుక్షా స్వామివారి నిజరూప దర్శనానికి రానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 9గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం నుంచి యథావిధిగా స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలిపారు.

డీఎస్సీ–2002 హిందీ పండిట్‌ అభ్యర్థులకు ఊరట

సిరిసిల్లటౌన్‌: దాదాపు రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీఎస్సీ–2002 హిందీ పండిట్‌ మెరిటోరియస్‌ అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగే దిశగా కీలక ముందడుగు పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు అభ్యర్థుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి కరీంనగర్‌ డీఈఓకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌డీ ఖాజామొహియుద్దీన్‌, సర్దార్‌ అమోలక్‌సింగ్‌, ఎస్‌డీ ముజాహిద్‌, పోల్కం విద్య, నీరేటి శ్రీనివాస్‌, గంభీరపేట శేఖర్‌, మట్ల కుమార్‌ అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి ఉమ్మడి జిల్లాలోని ఖాళీల ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా అనుసరణ నివేదిక సమర్పించాలని సూచించింది.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

కరీంనగర్‌ రూరల్‌: జిల్లా ప్ర భుత్వ ఆస్పత్రిలో అనా రోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందినట్లు కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఆపస్మారకస్థితిలో ఉన్న వ్యక్తిని 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు వివరించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడని, వయస్సు సుమారు 40 నుంచి 50ఏళ్ల లోపు ఉంటుందన్నారు.

బాలుడి మృతిపై విచారణ

బోయినపల్లి: సిమెంట్‌ బ్రిక్స్‌లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ పై నుంచి మైనర్‌ బాలుడు చల్లా మోహన్‌ పడి మృతిచెందిన ఘటనపై శనివారం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ సురేంద్రకుమార్‌ విచారణ చేపట్టారు. సాక్షిలో ప్రచురితమైన కథనానికి లేబర్‌ శాఖ అధికారులు స్పందించారు. జగిత్యాల అసిస్టెంట్‌ కమిషనర్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి సురేంద్రకుమార్‌ విచారణ నిర్వహించారు. మైనర్‌ బాలుడి మృతి, మైనర్‌లను పనిలో పెట్టుకున్నందుకు బ్రిక్స్‌ నిర్వాహకుడు మల్లికార్జునపై చైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలని బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్‌ఆర్‌ఆర్‌ సిమెంట్‌ బ్రిక్స్‌ యజమాని మల్లికార్జునపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement