కూచిపూడిలో అక్కాచెల్లెళ్ల రికార్డు | - | Sakshi
Sakshi News home page

కూచిపూడిలో అక్కాచెల్లెళ్ల రికార్డు

Nov 29 2026 1:59 PM | Updated on Nov 29 2026 1:59 PM

జగిత్యాల: వారికి చిన్నప్పటి నుంచే నాట్యంపై మ క్కువ. పదేళ్ల నిరంతరం సాధన.. గురువు ప్రోత్సాహం.. తల్లిదండ్రుల సహకారంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అరుదైన ఘనత సాధించారు. కూచిపూడి నాట్యంలో ప్రతిభ చాటుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన చెట్టి భవ్యశ్రీ, చెట్టి కార్తీన భారత్‌ నేషనల్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించారు. ఐదు గంటల పాటు నిర్విరామంగా ఇత్తడి పల్లెంపై తరంగం నృత్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

నాట్య సాధన

భవ్యశ్రీ, కీర్తన పదేళ్లుగా మేదిని లలితాకళాక్షేత్రం సంగీత నృత్య కళాశాలలో గురువు మేదిని భుజంగరావు వద్ద కూచిపూడి శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో పలు ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన నాట్య పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా నాట్య మయూరి, నాట్య విజ్ఞాన్‌, బాల ఉగాది పురస్కారాలు అందుకున్నారు.

ఇత్తడి పల్లెంపై ఐదు గంటల ప్రదర్శన

కూచిపూడి నాట్యంలో అత్యంత క్లిస్టమైన అంశాల్లో ఒక్కటైన తరంగం నృత్యాన్ని ప్రదర్శించేందుకు అక్కాచెల్లెళ్లు ప్రత్యేకంగా సాధన చేశారు. ఇత్తడి పల్లెంపై నిలబడి మృదంగానికి అనుగుణంగా మువ్వల సవ్వడి కలుపుతూ నృత్యం చేయడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ఏకాగ్రత, సమన్వయం, నిరంతర సాధన వల్లే ఈ ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ నృత్య ప్రదర్శన వివరాలను భారత్‌ నేషనల్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు పరిశీలించి పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌కు పంపించగా.. నవంబర్‌ 26న ప్రదర్శనను ఆమోదిస్తూ అక్కాచెల్లెళ్లకు ధ్రువీకరణ పత్రాలు అందించారు.

ఐదు గంటలపాటు ‘తరంగం’

జగిత్యాల ‘చెట్టి’ సిస్టర్స్‌ ప్రతిభ

నేషనల్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement