కరీంనగర్‌సిటీ: పరీక్షల శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని వీసీ ఉమేశ్‌కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో పరీక్షల శిక్షణ కేందాన్ని డాక్టర్ ఎన్.వి.శ్రీరంగాప్రసాద్‌తో కలిసి ఉపకులపతి ఆచార్య ఉమేశ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నా ణ్యమైన శిక్షణ మార్గదర్శకత్వం అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలి పారు. అన్ని రకాల సౌకర్యాలతో ఈ సెంట ర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి మంచి నిపుణులను తీసుకొచ్చి తరగతులు నిర్వహిస్తామని అన్నారు. వీసీ ఓఎస్డీ డాక్టర్ డి.హరికాంత్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అండ్ లా కళాశాల ప్రొఫెసర్ కె.పద్మావతి, ప్రిన్సిపాల్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
గుండె శస్త్ర చికిత్స విజయవంతం
కరీంనగర్‌రూరల్: ప్రతిమ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సాంకేతికతతో క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు సాయినాగలక్ష్మి తెలిపారు. సోమవారం ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్ల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలోని ఈజ్గాం గ్రామానికి చెందిన భీంరావు ఇటీవల గుండెనొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షలు చేశారు. గుండె రక్తనాళాలు ప్రారంభ భాగంలోనే బ్లాకేజీలుండడంతో స్టెంటింగ్ చేయడం సాధ్యం కాదని గుర్తించినట్లు చెప్పారు. అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా నిర్వహించినట్లు చెప్పారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయి ల్, మెడికల్ సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, రిజిస్ట్రార్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ప్రసాద్‌రావు, వైద్యులు నిఖిల్ పాల్గొన్నారు.
వాహనం ఢీకొని రైతు దుర్మరణం
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లి వార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు నేదూరి భూమయ్య(85) మృతిచెందాడు. ఇంటి నుంచి ఎల్లమ్మ ఆలయ ప్రాంతంలో ఉన్న తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా మర్రిపల్లి నుంచి వస్తున్న వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వీరప్రసాద్ ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు.


