కబడ్డీ పోటీల్లో నువ్వా.. నేనా అంటూ పోరు తగ్గేదేలే.. అంటున్న బాలికల జట్లు రెఫరీలుగా రాణిస్తున్న మహిళలు సత్తాచాటిన నారీశక్తి
వేములవాడ: కబడ్డీ కూత పెట్టడమే కాదు.. రిఫరీలుగా రాణిస్తామంటున్నారు నారీమణులు. వేములవాడలో నాలుగు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బాలికల జట్టు అదరగొట్టాయి. అదే సమయంలో మహిళా రిఫరీలు అద్భుతంగా విధులు నిర్వర్తించారు. ఎండను సైతం లెక్కచేయకుండా తమ విధులకు హాజరయ్యారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎండ తీవ్రతను తట్టుకొని 11 మంది మహిళా రెఫరీలు విధులు నిర్వహించారు. ఏ నిర్ణయంలోనైనా సందేహాలుంటే స్పష్టంగా వివరించి ఆటగాళ్ల మెప్పు పొందారు. కబడ్డీ పోటీల్లో స్ఫూర్తివంతంగా నిలిచిన మహిళా రిఫరీల అనుభవాలపై ప్రత్యేక కథనం.


