రన్నరప్‌గా నిలిచిన వనపర్తి, ఖమ్మం మూడో స్థానంలో కరీంనగర్ వేములవాడలో ముగిసిన పోటీలు బహుమతులు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్
బాలుర విజేత నల్గొండకు కప్ అందజేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్
బాలికల విజేత భద్రాద్రి కొత్తగూడెం జట్టు
వేములవాడ: వేములవాడలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. బాలుర విజేతగా నల్గొండ, బాలికల విజేతగా భద్రాద్రికొత్తగూడెం జట్లు నిలిచాయి. బాలురు, బాలికల్లో రన్నరప్‌గా వనపర్తి, ఖమ్మం జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో కరీంనగర్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. విజేతలకు ట్రోపీలను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు.
హోరాహోరీగా ఫైనల్
ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగం తుదిపోరులో వనపర్తి జట్టుపై నల్గొండ జట్టు విజయం సాధించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మక రైడింగ్‌లు, పక్కా ట్యాకిళ్లతో ఆధిపత్యం ప్రదర్శించిన నల్గొండ క్రీడాకారులు తుది వరకు పైచేయి సాధించి టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం జట్టుపై భద్రాద్రి కొత్తగూడెం విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ పాయింట్‌కూ సాగిన ఈ హోరాహోరీ సమరంలో కొత్తగూడెం క్రీడాకారిణులు అద్భుతంగా రాణించారు. బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కరీంనగర్ జట్టు ఖమ్మంపై విజయం సాధించింది. బెస్ట్ ప్లేయర్ అవార్డును నల్గొండకు చెందిన సోహెల్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, పూర్వ కబడ్డీ ప్లేయర్లు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
కబడ్డీ ఆడిన మంత్రి, విప్
ఫైనల్ మ్యాచ్‌లను తిలకించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా క్రీడాకారులతో కలిసి కాసేఉ కబడ్డీ ఆడారు. కబడ్డీ పోటీలను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.


