ఫీవర్‌.. ఫియర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫీవర్‌.. ఫియర్‌

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

● మంచం పడుతున్న జిల్లా ● జలుబు, దగ్గు... జ్వరంతో ప్రజల అవస్థలు ● వైరల్‌ ఫీవర్లతో ఇబ్బందులు ● కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ● దండుకుంటున్న ప్రైవేటు నిర్వాహకులు

కరీంనగర్‌: జిల్లాకు జ్వరమొచ్చింది. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబు జ్వరంతో మంచం పడుతున్నారు. జిల్లాలో ఒకేరోజులోనే కొద్దిసేపు ఎండా.. కొద్దిసేపు చల్లగా... మరికొద్ది సేపు వాన చినుకులు.. ఇలా వాతావరణం అసమతుల్యంగా మారింది. విచిత్ర వాతావరణంతో ప్రజలు జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకరికి ఈ తరహా అనారోగ్యం వస్తే ఇంటిల్లిపాదినీ చుట్టేస్తోంది. ఇది ప్రమాదకరమేమీ కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ఆసుపత్రులపాలయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఓపీ ఎక్కువగా, ఐపీ తక్కువగా ఉంటోంది. మందులతోనే పరిస్థితి అదుపులో ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారు ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

జలుబు, దగ్గుతో మొదలై

జలుబు, దగ్గుతో మొదలై వైరల్‌ ఫీవర్లుగా మారుతున్నాయి. వారం పది రోజులకు కానీ ఆరోగ్యం కుదుటపడటం లేదు. కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్‌) సహా జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్‌ ఫీవర్లతో జీజీహెచ్‌కు వస్తున్న వా రి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్‌ ఫీవర్‌, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ కేసులూ నమోదవుతున్నాయి. జ్వరాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరి స్తున్నారు. కరచాలనం, ఒకే వస్తువులు వాడటం, శా రీరక ద్రవాల తాకిడి వైరస్‌వ్యాప్తికి కారణమై జ్వరం సంక్రమణకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

నిర్లక్ష్యం చేయవద్దు

వైరల్‌ ఫీవర్లను నిర్లక్ష్యం చేయవద్దు. జ్వరం ముదిరితే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌కు చేరి ఇతర వ్యాధులకు దారి తీసి ప్రాణాంతకం కావచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి, వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్‌ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. 24 గంటల పాటు వైద్యులు, ఓపీ, ఐపీ, మందులు అందుబాటులో ఉన్నాయి.

– డాక్టర్‌ వీరారెడ్డి,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

ఆగస్టులో జీజీహెచ్‌లో ఓపీ వివరాలు

తేదీ ఓపీ ఐపీ

24 1,026 41

25 982 44

26 776 27 27 963 48

28 529 12

29 1,002 48

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement