వినాయక చవితి సమీపిస్తోంది. గణపతి విగ్రహాలు వాటి తయారీ విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పర్యావరణ అనుకూలతను బట్టి అనేక రకాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి విగ్రహం ఒక ప్రత్యేకమైన కళాత్మకత, భక్తి భావాన్ని ప్రతిబింబిస్తుంది. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడికి 32 విశిష్ట రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన కొన్ని రూపాల్లో ఒకటి బాల గణపతి.. చిన్న పిల్లవాడి రూపంలో ఉండే ఈ విగ్రహం చూసేందుకు ఎంతో ముద్దుగా.. అమాయకత్వంతో కూడి ఉంటుంది. ఇలా పలు ఆకారాల్లో వినాయక ప్రతిమలు నగరంలోని పలు ప్రాంతాల్లో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


