● కవ్వంపల్లి.. తేల్చుకో: యువజన సంఘాల నాయకులు
గన్నేరువరం: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గుండ్లపల్లి స్టేజి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు కావాలో..? పదవి కావాలో తేల్చుకోవాలని యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డబుల్ రోడ్డు వేయాలని గన్నేరువరంలో యువజన సంఘాల నాయకులు ఆదివారం చేపట్టిన నిరా హారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. తిమ్మాపూర్ సర్కిల్ సీఐ రమేశ్, ఎస్సై నరేందర్‌రెడ్డి పలు సంఘాల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్‌రోడ్డు కోసం నాడు పాదయాత్ర చేపట్టిన కవ్వంపల్లినేడు ఎమ్మెల్యేగా రోడ్డును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మూడు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి, మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. పది రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు నాగరాజు, శ్రీనాథ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంక న్న, అంజిరెడ్డి, లక్ష్మణ్, విక్రమ్‌రెడ్డి, సురేశ్, ప్రభాకర్, సుధాకర్ పాల్గొన్నారు.
శ్రీనాథ్‌రెడ్డి సస్పెన్షన్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అల్లూరి శ్రీనాథ్‌రెడ్డిని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు మండలాధ్యక్షుడు బొడ్డు సునీల్ తెలిపారు.
నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 11 కేవీ క్రిస్టియన్ కాలనీ ఫీడర్ నిర్వహణ పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మెడికవర్ వెనుక భాగం, సవరన్ స్ట్రీట్, రెడ్డి రెసిడెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


