జింకలపార్క్‌లో వన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

జింకలపార్క్‌లో వన మహోత్సవం

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

వాతావరణంజిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. జింకలపార్క్‌లో వన మహోత్సవం మైదానాల్లో క్రీడా జాతర స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి క్రీడా క్యాలెండర్‌ను విడుదల చేసింది. నాలుగు స్థాయిల్లో పోటీలు జరగనున్నాయి. 8లోu ● మొక్కలు నాటిన కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ

వాతావరణంజిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

కరీంనగర్‌ అర్బన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు నగరంలోని డీర్‌ పార్కులో గురువారం ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే మొక్కలు నాటారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రసంగాన్ని డీర్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా తిలకించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ముఖ్యమంత్రి సభను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. ఆర్డీవో షర్మిల, మెప్మా పీడీ స్వరూపారాణి, డీఆర్‌డీవో గీత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాశ్‌, కరీంనగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ షౌకత్‌ హుస్సేన్‌, స్ట్రైక్‌ ఫోర్స్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ షౌకత్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement