హుజూరాబాద్ రూరల్: మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో సహకార పరపతి సంఘం రజ తోత్సవ మహాసభ గురువారం ఘనంగా జరిగింది. కేడీసీసీ మాజీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ 25ఏళ్ల లోగో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1999లో 150మంది రైతులతో ప్రా రంభమైన సంఘం 25 ఏళ్ల ప్రస్థానంలో దేశంలోనే ఉత్తమ రైతు సహకార సంఘంగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు. వరంగల్ ‘సహా వికాస’ సంస్థ ప్రోత్సాహం, ముల్కనూరు గ్రామీణ బ్యాంకు సూచనలతో రైతుల ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తోందని కొనియాడారు. తెలంగాణ లోని అన్ని జిల్లాలతో పాటు జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావ రి, కష్ణా, గుంటూరు, విజయనగరం, అనంతపురం, కర్ణాటక ప్రాంతాలకు విత్తనాలు సరఫరా చేయ డం విశేషమన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ముల్కనూరు కో–ఆపరేటివ్ సంఘ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, డీఏవో భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య, కేడీసీసీ ఉపాధ్యక్షుడు పింగిలి రమేశ్, జనరల్ మేనేజర్ వీఎస్.రాజు, సంఘం అధ్యక్షుడు బొనగాని శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


