పలుకుబడి.. పైరవీలు! | - | Sakshi
Sakshi News home page

పలుకుబడి.. పైరవీలు!

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

జీవోఎంఎస్‌ నంబర్‌ 61లో సర్వీస్‌ స్టేషన్‌ అంటే ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు. క్వాలీఫయింగ్‌ సర్వీస్‌ స్టేషన్‌ అంటే ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు ఒకే స్టేషన్‌లో పని చేశాడో లెక్కిస్తారు. నగరం, పట్టణం, గ్రామంగా లెక్కిస్తారే తప్పా.. ఒక కార్యాలయం, మరో కార్యాలయాన్ని వేరే స్టేషన్‌గా పరిగణించరని ప్రభుత్వం స్పష్టంగా క్లారిఫికేషన్‌ ఇచ్చింది. ఉదాహరణకు కలెక్టరేట్‌ ప్రధాన విభాగంలో మూడేళ్లు పని చేసి తదుపరి పైఅంతస్తులో గల సివిల్‌ సప్లయ్‌ ఇతర కార్యాలయంలో మరో మూడేళ్లు పని చేస్తే సదరు ఆరేళ్లను ఒకే స్టేషన్‌గా పరిగణించాలి. కానీ ఇటీవల జరిగిన బదిలీల్లో ఇవేవీ పాటించలేదని స్పష్టమవుతోంది. కరీంనగర్‌ అర్బన్‌, రూరల్‌, కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయాలను కూడా ఒకే స్టేషన్‌గా పరిగణించాల్సి ఉంటుంది. డిప్యూటేషన్‌పై పని చేసినా సదరు కాలాన్ని కూడా లెక్కించాలని జీవో స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement