హరీశ్‌రావు మెప్పు కోసం కొప్పుల ఆరాటం | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావు మెప్పు కోసం కొప్పుల ఆరాటం

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

హరీశ్‌రావు మెప్పు కోసం కొప్పుల ఆరాటం ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కరీంనగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు మెప్పు పొందడానికి కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ సంక్షేమశాఖలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ.683 కోట్లతో టెండ్లర్లు పిలిచామని, రూ.500 కోట్లతో టెండర్ల ఖరారు చేశామన్నారు. మొత్తం రూ.1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, హరీశ్‌రావు రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్‌కు అవమానం జరిగితే తాను అండగా నిలిచానని గుర్తుచేశారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొప్పుల నియోజకవర్గానికి ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌ రెడ్డి వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని, జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సీజన్లలో వడ్లు కొనుగోలు చేసిందని, మరి అప్పుడు ఎంత కమీషన్‌ వచ్చిందో చెప్పాలని అన్నారు. అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, అమీర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement