సిరిసిల్ల/కరీంనగర్: పానీపూరీ తిని అస్వస్థతకు గురైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్‌కు చెందిన 32 మంది పిల్లలు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంర్రి బండి సంజయ్ ఆకాక్షించారు. ఎక్స్ వేదికగా గురువారస్పాయన ఘటనపై స్పందించారు. చిన్నారుల అస్వస్థత తనను ఎంతో బాధించిందన్నారు. ఇప్పటికే బాధిత పిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడానని, జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు వెల్లడించారు. చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
సిరిసిల్లటౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని సిరిసిల్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం బోతిబాగోల్‌కు చెందిన మేలక్ గులాం దస్తగీర్(25) సిరిసిల్లకు చెందిన మైనర్ బాలికను ఇన్‌స్ట్రాలో పరిచయం పెంచుకున్నాడు. తరచూ మెసేజ్‌లు పెట్టగా బాలిక కూడా రిప్లై ఇస్తుంది. ఈక్రమంలో ఆమెను నమ్మించి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈనెల 14న సికింద్రాబాద్‌కు రమ్మని అక్కడి నుంచి రైలులో గుజరాత్‌లోని నడియాడ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత రోజు అద్దె గది తీసుకొని మైనర్ అని తెలిసి కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి పోతా అంటూ ఏడవడంతో బుధవారం ఉదయం సిరిసిల్ల పాతబస్టాండులో వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపినట్లు సీఐ తెలిపారు.
చోరీలు చేస్తున్న తండ్రీకొడుకుల అరెస్టు
సిరిసిల్లటౌన్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న తండ్రి కొడుకులను అరెస్టు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన తండ్రి కొడుకులు బురాని గోపాల్ సింగ్, బురాని చరణ్ సింగ్‌లు గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన నిందితులన్నారు. ఈనెల 14న రాత్రి సిరిసిల్లలోని విద్యానగర్ ప్రాంతంలో మోటార్ కాపర్ వైర్‌ను దొంగలించినట్లు తెలిపారు. 15న సిరిసిల్లలోని గణేశ్‌నగర్‌లో షాపు తాళం పగులగొట్టి నగదు అహరించారని అన్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ తమ వద్ద ఉన్న కాపర్‌వైర్‌ను విక్రయించేందుకు గురువారం పెద్దబజార్ ప్రాంతానికి తీసుకరాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాపర్‌వైర్‌తో పాటు నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
● కేంద్ర మంత్రి బండి సంజయ్
● ఎక్స్ వేదికగా ప్రకటన


