కరీంనగర్ కల్చరల్: కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మిస్తున్న భవన పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశ్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన పఠన మందిరాలు, డిజిటల్ సదుపాయాలు, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, కళాత్మక చిత్రాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ నం పోటీ పరీక్షల అభ్యర్థులు, పరిశోధకులు, పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మరో 15 రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. భవన నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.


