రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

జమ్మికుంట: మక్కల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులను కలిసి కొనుగోళ్ల ప్రక్రియ, గన్నీబ్యాగుల కొరత, రవాణా ప్రక్రియపై ఆరా తీశారు. అధికారులు కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. లోడ్‌ చేసిన బస్తాలను వెంటనే గోదా ముకు తరలించి, నిల్వ చేయాలన్నారు. మార్కె ట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్న, హుజూరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎంవో మహ్మద్‌ షాబోద్దీన్‌, తాహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, టౌన్‌ సీఐ రామకృష్ణ, మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి రాజా, సెంటర్‌ ఇన్‌చార్జి ఎగిత అశోక్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ రైతు దగా ప్రభుత్వం

కరీంనగర్‌ అర్బన్‌: చెప్పేదొకటి.. చేసేదొకటన్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి ఉందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆరోపించారు. రైతు ప్రభుత్వమని సుద్దులు పలికే పాలకులు 20రోజులుగా మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన ఎందుకు నిలవడం లే దని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్‌లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగునీరు, నీడ లేదని ఆరోపించారు. మార్క్‌ఫెడ్‌తో పాటు వ్యవసాయ మార్కెట్‌ అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడే ప్రమాదం ఉందని, మక్కలను వెంటనే కాంటా పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్యాక్స్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాం సుందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్లు పొన్నం అనిల్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, తిరుపతి నాయక్‌, సుంకిశాల సంపత్‌ రావు, పాల్గొన్నారు.

వేగవంతంగా కొనుగోళ్లు

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ వ్యవసాయ మా ర్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగానే కొనసాగుతున్నాయని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు యథావిధిగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం మార్కెట్‌ యార్డును పరిశీలించి పారిశుధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెట్‌ యార్డ్‌ మొత్తం క్లీనింగ్‌ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. చివరి గింజ వరకూ వరి, మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

నగర అభివృద్ధే లక్ష్యం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రెండవ డివిజన్‌ చంద్రపురికాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. 13, 44వ డివిజన్ల పరిధి సప్తగిరికాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన కమ్యునిటీ హాల్‌ను ప్రారంభించారు. త్వరలోనే ప్రతి డివిజన్‌ను రూ.10 లక్షల సాధారణ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేటర్లు చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, తెల్ల లక్ష్మి రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement