పెట్రోమంటపై వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

పెట్రోమంటపై వినూత్న నిరసన

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

కరీంనగర్‌ టౌన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ ధరలు పెంచి సామాన్యులకు షాక్‌ ఇచ్చిందని, పెంచిన ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక గీతా భవన్‌ చౌరస్తాలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే సర్కారు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ ధరలు పెంచిందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్‌, జి.రాజేశం, తిప్పారపు సురేశ్‌, రాయికంటి శ్రీనివాస్‌, గజ్జల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement