పుస్తకం.. మంచి నేస్తం | - | Sakshi
Sakshi News home page

పుస్తకం.. మంచి నేస్తం

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

కరీంనగర్‌ కల్చరల్‌: గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞానాన్ని పంచే నిలయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, ఆర్టీవో మహేశ్వర్‌ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యువత ఫోన్లకే పరిమితం కాకుండా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రంథాల యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పలు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement