● అనాథలైన పిల్లలు
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదంలో తండ్రి బుధవారం మృతిచెందగా.. నాలుగేళ్ల క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎరవెల్లి పరుశురాం(43) హనుమాన్ మాల ధరించి విరమణ కోసం బుధవారం కొండగట్టుకు వెళ్లాడు. మాల విరమణ అనంతరం కారులో ధర్మపురి దర్శనానికి వెళ్లగా.. వెల్గటూరు మండలం చర్లపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లీదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు అనాథలయ్యారు. పెద్దకూతురు ఇటీవల 10వ తరగతి పాసైంది.


