హుజూరాబాద్: పట్టణంలోని సబ్‌స్టేషన్ ఎదురుగా కరీంనగర్ ప్రధాన రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి సదానందం, రమేశ్ బైక్‌పై వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదానందం చికిత్స పొందుతూ మృతి చెందాడని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మానేరులో మునిగి బాలిక మృతి
తిమ్మాపూర్: మానేరు రిజర్వాయర్ వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎల్‌ఎండీ పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన షషాబ్ మోహల్లా (పండ్ల వ్యాపారి) తమ్ముడు పర్వేజ్ ఖాన్, అతని భార్య, పిల్లలు, షషాబ్‌మోహల్లా కూతురు బమెమా ఐరా ఖాన్ (14) ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం 4:30 గంటలకు మానేరు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో పిల్లలు, కుమార్తె నీటిలో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన పర్వేజ్ ఖాన్ నీటిలోకి దూకాడు. చేపలు పడుతున్న వారి సహాయంతో కుమార్తెలను రక్షించాడు. అయితే అప్పటికే షషాబ్ మోహు కుమార్తె ఐరా ఖాన్ నీటిలో మునిగి చనిపోయింది. సాయంత్రం 6 గంటలకు జాలరులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు.


