విద్యుత్‌షాక్‌తో కౌలురైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో కౌలురైతు మృతి

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

బోయినపల్లి(చొప్పదండి): కౌలుకు తీసుకునన్న మామిడితోటలో విద్యుత్‌ వైరు తొలగించే క్రమంలో షాక్‌కు గురై కౌలురైతు గన్నెబోయిన చంద్రయ్య(49) గురువారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన చంద్రయ్య బోయినపల్లి మండలం కోరెం శివారులో మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. మామిడితోటలో వేసిన కరెంటువైర్‌ను తొలగించే క్రమంలో చేతికి చుట్టుకుంటూ తీసుకెళ్తుండగా మధ్యలో ఉన్న జాయింట్‌ వద్ద విద్యుత్‌ ప్రవహించి షాక్‌ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్‌ సీఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement