● ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ టౌన్: ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక నిధులు వెచ్చిస్తోందని, విద్యాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్‌అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల కార్పొరేటర్లు, సర్పంచులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, డైట్ ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్, డీఈవో శ్రీరాం మొండయ్య, ఎంఈవోలు ఆనందం, భద్రయ్య, వాసవి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, జీసీడీవో ఉమ, ఆర్పీలు గాజుల రవీందర్, కేఎస్.అనంతాచార్య పాల్గొన్నారు.


