చిగురుమామిడి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చిగురుమామిడి మండలం నవాబుపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అధికారులు అలసత్వం వీడాలని, పంచాయతీకార్యదర్శులు, ఏఈవోలు సమన్వయం చేసుకోవాలన్నారు. తూకం వేసిన తరువాత లారీలను మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేకంగా ఎంవీఐ అధికారిని నియమించినట్లు తెలిపారు. అనంతరం నవాబుపేట్‌లో బోదాసు లలిత–రవి దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ గూల్ల రజితరాజు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ పాల్గొన్నారు.


