ఐక్యమత్యమే ఉద్యోగుల బలం | - | Sakshi
Sakshi News home page

ఐక్యమత్యమే ఉద్యోగుల బలం

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

● ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

కరీంనగర్‌ అర్బన్‌/కరీంనగర్‌ టౌన్‌ :విధుల్లో విరా మం లేకుండా గడపడమే కాకుండా వీలుచిక్కినప్పుడల్లా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఉద్యోగుల మధ్య ఆత్మీయ అనుబంధం పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీవోల కమ్యూనిటీ హాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేది పంచాయతీ కార్యదర్శులేనన్నారు. బర్త్‌ సర్టిఫికేట్‌ నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ వరకు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, పల్లె ప్రకృతి వనం వంటి అనేక బాధ్యతలను కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రొబేషన్‌, రెగ్యులరైజేషన్‌, పెండింగ్‌ బిల్లులు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ మాట్లాడుతూ, అన్ని శాఖల పనులు నిర్వహించడంతో ఒత్తిడి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ప్రజల ఆదరణ, గౌరవం పంచాయతీ కార్యదర్శులకే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రతీ నాలుగో శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశఽం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి, టీఎన్‌జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేశ్‌ భరద్వాజ్‌, సుస్మిత, గోదావరి అజయ్‌, రాకేశ్‌, రేవంత్‌ రెడ్డి, కిరణ్‌, వాహజ్‌, మధుమిత, కార్తీక్‌, మహేందర్‌ రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement