ఇద్దరి దుర్మరణం
ముగ్గురికి గాయాలు.. మరొకరి పరిస్థితి విషమం
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
మానకొండూర్: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల వివరాలు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం వరంగల్ జిల్లాలో బుధవారం జరిగిన వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తున్నా రు. మండలంలోని ఖాదర్‌గూడెం శివారులో బోధన్ డిపోకు చెందిన బస్సు వరంగల్ వైపు వెళ్తూ కారును ఢీకొట్టింది. కారు డ్రైవర్ ఖలీద్, పెద్దపల్లికి చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. సుమతి(65), ఉమ(36), వెంకటవరప్రసాద్ అలియాస్ శ్రీధర్(52) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజు భార్య సుమతి పరిస్థితి విషమంగా ఉంది.
రాంగ్‌రూట్‌లో ప్రయాణం
చెంజర్ల శివారులో కారు డ్రైవర్ రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ ఖలీద్ సీటులోనే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ శ్రీలత 108 వాహనంలో క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫాబాద్‌కు చెందిన వెంకట వరప్రసాద్ అలియాస్ శ్రీధర్ భార్య ఉమ ఉద్యోగిని కావడంతో మంచిర్యాలలో ఉంటున్నారు. శ్రీధర్ బావ రాజు, సోదరి సుమతిని పెద్దపల్లిలో దింపి వెళ్లాలని కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఖలీద్ మృతదేహం
రాజు మృతదేహం


