పోలీసు శాఖలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు విభాగం సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీల హక్కులు, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నియామకాలు, పదోన్నతులు, సేవా వ్యవహారాల్లో వివక్షత చూపొద్దని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సిఫారసు చేయడం ద్వారా ప్రమోషన్లలో కొంత ఉపషమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌బాబు, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏజీపీ(లా అండ్ ఆర్డర్) రమణ, లీగల్ సెల్ అదనపు ఎస్పీ సతీశ్, సీఐడీ ఎస్పీ అనన్య, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నేను దళిత మహిళను. కుమారస్వామి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసిండు. అన్యాయంగా నా ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని జైలుకు పంపించిండు. అప్పటి ఎస్సై ఉపేందర్ ఆయనకు సహకరించారు. కుమారస్వామి, ఎస్సై ఉపేందర్‌తోపాటు మరికొందరిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి.
– స్వరూప, నస్పూర్, మంచిర్యాల జిల్లా
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్
ఎన్టీపీసీలో పోలీసు అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష


