దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముంజ స్కైలాబ్‌గౌడ్(45) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్కైలాబ్‌గౌడ్ గత పదేళ్లుగా దుబాయిలోని అబుదాబి ఏరియాలో ముసాయిదా క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న తాను ఉంటున్న క్యాంపులోనే గుండెపోటు రావడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన బొంకంటి గంగాధర్ (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీకి వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా లక్ష్మీపూర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఆకస్మాత్తుగా బర్రె అడ్డు వచ్చి గంగాధర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో గంగాధర్ కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు బొంకంటి నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం నవాబుపేట్‌కు చెందిన కక్కెర్ల వివేక్ అనే డిగ్రీ విద్యార్థి కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ కథనం ప్రకారం.. వివేక్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 24న హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కరీంనగర్ వెళ్తున్నానని తల్లి సబితతో చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంగళవారం సైదాపూర్ మండలం సోమారం కాకతీయ కెనాల్ వద్ద వివేక్ మృతదేహాన్ని గుర్తించారు. తన కొడుకు డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సెల్ఫీ వీడియో తీసుకొని.. పురుగుల మందు తాగి..
● కుటుంబ సభ్యుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రా మానికి చెందిన నాగెల్లి వెంకట్‌రెడ్డి కుటుంబ కలహాలతో సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, ఎల్‌ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్‌రెడ్డి చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాడు. గతేడాది నవంబర్ 7వ తేదీన కరీంనగర్‌కు చెందిన మనీషాతో వివాహమైంది. సూపర్ మార్కెట్ విషయమై తమ్ముళ్లు శేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, తల్లిదండ్రులు రాజిరెడ్డి,అనసూర్యతో గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర మనస్తాపానికి గురై తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శ్మశానవాటికలో క్రిమిసంహారక మందు తాగుతున్నట్లు భార్య, తన బావలకు ఫోన్‌చేశాడు. సమాచారం అందుకున్న వారు వెంకట్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయాడు. మనీషా ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్లక్రైం: చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.3వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎ.ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పారు. పట్టణ సీఐ తెలిపిన వివరాలు.. శివనగర్‌కు చెందిన కొండా రంజిత్ 2020 అక్టోబర్‌లో చంద్రంపేటకు చెందిన అనగందుల గోపి ఇంట్లో రూ.38 వేల విలువగల కెమెరాను చోరీ చేశాడు. అప్పటి ఎస్సై నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు.
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి


