గుండెపోటుతో ఆటోడ్రైవర్ మృతి
కోనరావుపేట(వేములవాడ): ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. కుమారులు లేకపోవడంతో కూతుళ్లే పాడెమోసి అంత్యక్రియలు నిర్వహించారు. మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి బాబు(58) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. కాగా మృతునికి భార్య నర్సవ్వ, నలుగురు కూతుళ్లు మమత, స్వప్న, శ్వేత, సాహిత్య ఉన్నారు. కుమారులు లేకపోవడంతో నలుగురు కూతుళ్లు పాడె మోశారు. కూతురు సాహిత్య అంత్యక్రియలు నిర్వహించింది.
పాడె మోసిన కూతుళ్లు
గుండెపోటుతో ఆటోడ్రైవర్ మృతి


