బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి
వేములవాడ: ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆదేశించారు. సోమవారం వేములవాడకు చేరుకున్న రాంచందర్‌కు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. భీమేశ్వర ఆలయ అతిథి గృహంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాంచందర్ మాట్లాడుతూ ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి చార్జీషీట్ వేస్తే బాధితులకు న్యాయంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు. జిల్లాలో ఎస్టీల సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా చూడాలన్నారు. కులాంతర వివాహాలకు ఇటీవల ఇద్దరికి రూ.2.50 లక్షల ఫిక్స్‌డ్ బాండ్లు అందజేశామని, అంబేడ్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యానిధి కింద 8 మంది విద్యార్థులకు ఒక్కొకరికి రూ.20లక్షల చొప్పున అందించినట్లు వివరించారు.
భీమేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాల్లో పూజలు
భీమేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాల్లో రాంచందర్ పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాభాయి, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఇన్‌చార్జి ఎస్సీ సంక్షేమాధికారి రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్
భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల్లో పూజలు


