క్రికెట్ చాంపియన్ అల్ఫోర్స్ ఇ–టెక్నో
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న ‘అల్ఫోర్స్ క్రికెట్ చాంపియన్‌షిప్’ను కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ– టెక్నో స్కూల్ కై వసం చేసుకుంది. విజేత జట్టుకు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి సోమవారం ట్రోఫీ అందజేసి మాట్లాడారు. క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో టోర్నమెంట్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అల్ఫోర్స్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


