ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సత్కారం
జగిత్యాలరూరల్: జగిత్యాలలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్ సత్కరించారు. ఇటీవల కొత్తబస్టాండ్ చౌరస్తాలో అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్పృహ కోల్పోగా డ్యూటీలో ఉన్న చంద్రశేఖర్ అతడికి సీపీఆర్ చేసి 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దీంతో చంద్రశేఖర్ సోమవారం ఎస్పీ చేతుల మీదుగా మానవత సత్కారం అందుకున్నారు. ట్రాఫిక్ ఎస్సై మల్లేశం పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సిరిసిల్లక్రైం: ఛాతిలో నొప్పి అంటూ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన అల్లె వేణు(45) పవర్లూమ్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఉదయం ఛాతిలో నొప్పి వస్తుందని తన కొడుకుతో కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యుడు అందుబాటులో లేడని, కాసేపటికి రావాలని సిబ్బంది సూచించడంతో కొంత సమయం తర్వాత మళ్లీ వెళ్లాడు. వేణును పరీక్షించిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా, వైద్యుడి సూచనమేరకు ఇంజక్షన్ వేశారు. కాగా ఇంజక్షన్ వేసిన కొద్ది సేపటికే వేణు తీవ్ర అస్వస్థకు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైదులు పరీక్షించిన అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య హిమబిందు, కుమారులు అఖిల్, నిఖిల్, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, పోలీసు బలగాలు ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు.
గోదావరిఖని(రామగుండం): స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి శారదానగర్ సింగరేణి క్వార్టర్‌లో ఓ కార్మికుడి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. శారదానగర్‌లోని ఎస్సీ టూ–57 క్వార్టర్‌లో ఉంటూ జీడీకే–5 ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుంకరి ప్రతాప్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. దొంగలు ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 11 తులాల బంగారం, 24 తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సత్కారం


