డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని 26వ డివిజన్ ఆదర్శనగర్‌లో రూ.20 లక్షలతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, ఒక్కొక్కటిగా అన్ని రోడ్లు, డ్రైనేజీలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. రోడ్లు ఇరుకుగా ఉన్న చోటనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, దండి రవీందర్, గీసా శ్రీనివాస్, మన్నె పద్మారావు, కొందటి లక్ష్మీనారాయణ, మన్నె పద్మావతి, గీసా కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


