చైనామాంజా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మెట్‌పల్లి: నిషేధిత చైనామాంజాను మెట్‌పల్లికి సరఫరా చేస్తున్న నిర్మల్‌కు చెందిన ఎండీ.ఫిరోజ్‌ఖాన్‌ను ఎస్సై కిరణ్‌కుమార్ అరెస్ట్ చేశారు. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన బాలుడు శ్రీహన్ ఈనెల 8న తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గాలిలో చైనామాంజా వచ్చి అతని మెడకు చుట్టుకుని గాయపడిన విషయం తెల్సిందే. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరుసటి రోజు ఈ మాంజాను స్థానికంగా విక్రయిస్తున్న షేక్ సిద్దిక్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నిర్మల్‌కు చెందిన ఫిరోజ్‌ఖాన్ ఇక్కడకు సరఫరా చేస్తున్నాడని తెలపడంతో ఎస్సై అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దుకాణంలో భారీగా నిల్వ చేసిన చైనామాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


