రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
సుల్తానాబాద్‌రూరల్/జూలపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని కొమండ్లపల్లికి వెళ్లే రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో వ్యవసాయ కూలీ గీకూరు కవిత(35) మృతి చెందింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన గీకూరు కవిత, మరికొంత మందితో కలిసి మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్తున్నారు. ఈక్రమంలో కొమండ్లపల్లి నుండి కంకర లోడ్‌తో ట్రాక్టర్ ఎదురుగా రావడంతో అటోలో కూడి సైడ్ కూర్చున్న గీకూరు కవితను ఢీకొనడంతో కింద పడగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త కనకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


