జాతీయ పురస్కారానికి ఎంపిక
కోనరావుపేట(వేములవాడ): జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారానికి కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మోతె రాజిరెడ్డి ఎంపికయ్యారు. కామారెడ్డి రక్తదాతల గ్రూప్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో(ఐవీఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాల్లో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, వ్యక్తులకు జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. 2025లో మూడుసార్లు రక్తదానం చేసిన దాతలకు ఉత్తమ పురస్కారాలను సోమవారం కామారెడ్డిలో ప్రదానం చేస్తున్నారు. 79 మందికి పురస్కారాలను అందిస్తున్నారు.


