వృద్ధుడి ఆత్మహత్మ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అనంతరాం గ్రామానికి చెందిన జీకూరి నర్సయ్య(69) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్య కొద్దికాలంగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. నర్సయ్య కోడలు శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమా సాగర్ తెలిపారు.
దొంగల ముఠా అరెస్ట్
గంభీరావుపేట(సిరిసిల్ల): దొంగతనాలు చేస్తున్న ముఠాను గంభీరావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆదివారం అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, మేడ్చల్‌కు చెందిన జంపయ్య, శంకర, జయప్రకాశ్, గోలు శంకర్ దొంగతనాలకు పాల్పడ్డారు. గంభీరావుపేట మండలం కోళ్లమద్ది, మల్లారెడ్డిపేట, జగదాంబతాండ, గజసింగవరం గ్రామాల్లో మోటార్లను దొంగిలించినట్లు ఎస్సై తెలిపారు. సముద్రలింగాపూర్‌లో దొంగతనం చేస్తుండగా పట్టుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్‌కుమార్ వివరించారు.
రోడ్డుప్రమాదంలో పలువురికి గాయాలు
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టులో ఆదివారం కారు–లారీ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. హనుమకొండ పట్టణం నయీంనగర్‌కు చెందిన మాధవి కుటుంబసభ్యులు కారులో వేములవాడ దైవదర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా, వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ కొత్తగట్టులో ఢీకొన్నాయి. ఈప్రమాదంలో మాధవి, ఆమె కుమారుడికి గాయాలు కాగా, మరో ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. గాయపడినవారిని హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ స్తంభాన్ని
ఢీకొన్న వ్యాను
మల్యాల: మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాన్ని ఆదివారం వ్యాన్ ఢీకొనడంతో స్తంభం విరిగి పడింది. వారసంత సమీపాన మందులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో స్తంభం రహదారిపైన విరిగి పడింది. ఎవ్వరూ లేకపోవడంతోఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అధికారులు స్తంభాన్ని పక్కకు తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
వృద్ధుడి ఆత్మహత్మ


