అక్షరయోధుడు ‘అలిశెట్టి’
సంతోషంగా ఉంది
● నేడు ప్రభాకర్ జయంతి, వర్ధంతి
కరీంనగర్‌కల్చరల్: పేదరికంలో పుట్టి, పేదల పక్షాన తన కవిత్వాన్ని రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల పట్టణంలో లక్ష్మి, చిన్నరాజం దంపతులకు 12 జనవరి 1956లో జన్మించారు. 1993 జనవరి 12న అనారోగ్యంతో మరణించారు.
కవిగా ప్రయాణం
ప్రభాకర్ మొదట ఆర్టిస్ట్‌గా ఎదిగారు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేశారు. తర్వాత సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించారు. 1974లో ఆంధ్రసచిత్ర వార పత్రికలో వచ్చిన శ్రీపరిష్కారంశ్రీ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో నడిపారు. అక్కడ నిర్బంధం ఎదురుకాగా మకాంను కరీంనగర్‌కు మార్చారు. ఇక్కడ 1978లో ఫొటో స్టూడియో ప్రారంభించారు. కొన్నిరోజులకు ఇక్కడా నిర్బంధం ఎదురుకావడంతో హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ స్టూడియో చిత్రలేఖ ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగినా ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. 1976లో చురకలు, 1978లో ఎర్రపావురాలు, 1983లో మంటల జెండాలు, రక్తరేఖ, 1990లో సంక్షోభ గీతాలు, 1992లో సిటీ లైఫ్ కవిత సంకలనాలను రాశారు. కాగా సోమవారం కరీంనగర్ ఫిలింభవన్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ పేరు మీద పురస్కారం అందజేయనున్నారు.
నిబద్ధతతో కవిత్వాన్ని సృష్టించిన అభ్యుదయ కవి అలిశెటి ప్రభాకర్ పేరు మీద పురస్కారం తీసుకోవడం సంతోషంగా ఉంది. అవార్డు ప్రకటించిన తెరవే కార్యవర్గానికి ధన్యవాదాలు.
– చమెన్, కవి
అక్షరయోధుడు ‘అలిశెట్టి’


