ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకారం
కరీంనగర్‌కల్చరల్: మహిళలకు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ రాష్ట్ర మహిళ విభాగం కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇప్పటికే మహిళ వైద్యులు శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం మహిళ విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌గా డాక్టర్ వై.స్వీతిఅనూప్, కో చైర్‌పర్సన్‌గా డాక్టర్ పి.శోభారాణి, కన్వీనర్‌గా డాక్టర్ ఝాన్సీ, అడ్వైజర్ డాక్టర్ పి.శ్రీలతరెడ్డి, మెంబర్‌గా డాక్టర్ ఎన్.కీర్తన ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆకుల శైలజ, నాగసముద్రం మహేశ్, కోశాధికారి నీలిమ, సీనియర్ వైద్యులు హరికిషన్, విజయమోహన్‌రెడ్డి, ఎంఎల్‌ఎన్ రెడ్డి, ఆలీం, సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సాయిని నరేందర్, ఆది శ్రీదేవి తదితరులున్నారు.


