ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అశోక్‌నగర్‌లో నివాసముండే కరబూజ గీతాంజలి (35) శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్యాల మండల కేంద్రానికి చెందిన గీతాంజలికి విద్యానగర్‌కు చెందిన లక్ష్మ ణ్‌తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గీతాంజలి కొడుకు, తల్లితో కలిసి అశోక్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఏం జరిగిందోగా నీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గీతాంజలి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
తల్లి మందలించిందని..
గొల్లపల్లి: తల్లి మందలించిందన్న మనస్తాపంతో కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారంపల్లి గంగయ్య, రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన పవన్‌కల్యాణ్ (22) తాపీపనులకు కూలీగా వెళ్తుంటాడు. అతని సోదరుడు కూడా కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్ల క్రితం గంగయ్య మృతిచెందారు. వీరి భారం తల్లిపై పడింది. అప్పటి నుంచి కొడుకులను సాకుతూ ఉంది. కొంతకాలంగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇద్దరు కుమారులు అమ్మ ఆలనపాలన చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. ఇద్దరికీ పెళ్లికాలేదు. నిరుపేదలు కావడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి కల్యాణ్ ఆర్థిక సహాయం చేయడం లేదని తల్లి శుక్రవారం మందలించింది. అప్పటినుంచి కల్యాణ్ మనస్తాపంతో ఉంటున్నాడు. రాత్రి 11.30 గంటలైనా ఇంటికి రాలేదు. రాధ వేకువజామున లేచి చూసే సరికి ఇంటి దర్వాజకు ఉరేసుకుని కనిపించాడు. రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మానసిక సమస్యలతో మహిళ..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మారేడుకొండ రాజేశ్వరి(60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజేశ్వరి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. శుక్రవారం పురుగుల మందు తాగగా, ఆమె కొడుకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి కొడుకు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఉన్న ‘అమ్మా అనాథ వృద్ధాశ్రమం’లో విషాదకర పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావడానికి సరైన దారి లేక వృద్ధులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆశ్రమంలో ఉంటున్న యాంసాని సత్యలక్ష్మి (78) శనివారం కాలుజారి పడడంతో ఆమె నడుము విరిగింది. అలాగే గోగుల లక్ష్మి (65) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆశ్రమ నిర్వాహకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాగా, ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయంగా ఉండటంతో వాహనం లోపలికి రాలేకపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది సుమారు గంట సేపు శ్రమించి, బాధితులను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి చాలా దూరం మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. 13 ఏళ్లుగా ఆశ్రమానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ స మస్య మరీ దారుణంగా ఉంటుందని, అత్యవసర వైద్యం అందక వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య


