నలుగురు దొంగల అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన న లుగురు దొంగలను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.30వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన మరాటి రాజేశ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అల్లూరుకు చెందిన కోసిడిగ నగేశ్, హయత్‌నగర్ పరిధి గౌరవెల్లికి చెందిన బొంతశేఖర్, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆడెపు రవి జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. గతంలో వీరందరిపై దొంగతనం, గంజాయి విక్రయించిన కేసులు ఉన్నాయి. శేఖర్ అనే వ్యక్తిపై 34 కేసులు ఉండగా, రాజేశ్‌పై 22, నగేశ్‌పై 14 కేసులు ఉన్నాయి. వీరు పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇండ్లను చూసి అదే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. ఈక్రమంలోనే రెండు రోజుల వ్యవధిలో గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి రూ.80వేల నగదుతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. దొంగలను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.
చైనా మాంజా అమ్మితే జైలుకే..
చైనా మాంజా దారం అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. చైనా మాంజాతో ప్రకృతికి విఘాతం కలగడమే కాకుండా, వాహనదారుల గొంతులకు తగిలితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఎవరి వద్దనైనా చైనా మాంజా సంబంధించిన సరుకులు దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చే పోస్టులను ఓపెన్ చేయొద్దనిని సూచించారు.
రూ.30వేల నగదు, బైక్ స్వాధీనం


