21 నుంచి పీజీ పరీక్షలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఎస్‌యూ పరిధిలో ఎంసీఏ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఎంబీఏ 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్ తెలిపారు. ఎంఎస్సీ, ఎంకాం, ఎంఏ 3వ సెమి స్టర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. బీఫార్మసీ కోర్సులో 7,8వ సెమిస్టర్ ఫీజు ఈ నెల 19 లోపు చెల్లించాలని తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో 21 వరకు అవకాశం ఉందన్నారు. ఎల్‌ఎల్‌బీ 1వ, 3వ సెమిస్టర్ పరీక్ష రుసుం ఈ నెల 17లోపు చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుంతో ఈనెల 20లోపు చెల్లించవచ్చునని తెలిపారు.
దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్ టౌన్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన అర్హత గల నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని బ్రాంచ్ డిప్యూటీ డైరెక్టర్, సెక్రటరీ ఎం.నాగులేశ్వర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ, కుటుంబవార్షిక ఆదాయం రూ.3లక్షలలోపు ఉండాలన్నారు. దరఖాస్తులను వెబ్‌సైట్ ద్వారా జనవరి 30వ తేదీలోపు సమర్పించాలన్నారు. 8121626423, 9885218053 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
గురుకుల ప్రవేశాలకు..
తిమ్మాపూర్: గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ రీజినల్ కోఆర్డినేటర్ అంజలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో ఐదోతరగతి,6,9 తరగతిలో ఖాళీలకు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పెరిగిన పత్తిధర
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం క్వింటాల్‌కు రూ.7,550 పలుకగా.. శుక్రవారం రూ.7,600 పలికింది. మార్కెట్‌కు 12 వాహనాల్లో 90 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.7,100కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు మార్కెట్‌కు సెలవు ఉంటుందని, సోమవారం యథా విధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా వివరించారు.
వేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగాయి.
21 నుంచి పీజీ పరీక్షలు


