మహిళల ఆరోగ్యంతోనే అభివృద్ధి
కరీంనగర్‌రూరల్/రామడుగు: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బొమ్మకల్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ పరీక్షల్లో కేన్సర్ కేసులు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించి, చదువుతోపాటు పోషణపై దృష్టిపెట్టడం జరుగుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ శుక్రవారం సభ ప్రారంభించినప్పటి నుంచి మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. అనంతరం జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో చదివి కానిస్టేబుల్‌గా ఎంపికై న జకినపల్లి హారికను సన్మానించారు. అనంతరం రామడుగు మండలం వెదిరలోని కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సిలబస్, బోధించిన పాఠ్యాంశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో సుగుణ, సీడీపీవో సబిత, సూపర్‌వైజర్ నిర్మల, తహసీల్దార్ రాజేశ్, ఆర్‌ఐ వాస్తవిక్ పాల్గొన్నారు.


