పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు నేపథ్యంలో శనివా రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.సంతోష్‌నగర్, మహాశక్తి ఆలయం ఫీడర్లపరిధిలోని సంతోష్‌నగర్, సంతోషిమాత, హ నుమాన్, మహాశక్తి ఆలయం, బాలాజీ సూపర్‌మార్కెట్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనక, కార్పెంటర్ సొసైటీ, కొత్తలేబర్ అడ్డా, సెయింట్‌జాన్స్ స్కూల్, 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని విద్యానగర్, కొత్తయాస్వాడ, వెంకటేశ్వరస్వామి కమాన్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ.ఇండస్ట్రీయల్, రాంనగర్ ఫీడర్ల పరిధిలోని పద్మనగర్, మానేరు స్కూల్ వెనక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
రూరల్ సబ్ డివిజన్‌లో
132 కేవీ దుర్శేడ్– కరీంనగర్ లైన్ పనులు, 33/11 కె.వీ.మొగ్ధుంపూర్ సబ్‌స్టేషన్ పునర్మిర్మాణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, ఫకీర్‌పేట, బహద్దూర్‌ఖాన్‌పేట, జూబ్లీనగర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు 33/11 కె.వీ. రేకుర్తి, కొత్తపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని రేకుర్తి, కొత్తపల్లి ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 33/11 కె.వీ బొమ్మకల్ సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, సిటిజన్‌కాలనీ, ప్రియదర్శినికాలనీ, కృష్ణనగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్‌పల్లి, దుర్శేడ్, గోపాల్‌పూర్, నల్లకుంటపల్లితో పాటు పాటు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చింతకుంట, కమాన్‌పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.


