అమ్మపాలు.. జీవధార
శిశువులకు జీవం పోస్తున్న మదర్ మిల్క్ బ్యాంక్
● కరీంనగర్‌లో పాలు సేకరించి.. శిశువులకు అందించి
● పాలు అందిస్తున్న 300 మంది తల్లులు
12 గంటలపాటు నిల్వ
తల్లి నుంచి సేకరించిన పాలను 12 గంటల పాటు ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో నిలువ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రోజు కూడా అంత సమయం నిలువ ఉంచే పరిస్థితి రాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిల్క్ బ్యాంక్‌లో పాలను సేకరించే తల్లులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలోనే పాలసేకరణ, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీ నెల 300 మంది తల్లుల నుంచి పాలు సేకరించి ప్రతీ రోజు 5 నుంచి 8 మంది పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందని వారికి ఈ బ్యాంకు ద్వారా అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.


