డబ్బా పాలే దిక్కు
మంథని: తల్లి పాలు సరిపోని అప్పుడే పుట్టిన బిడ్డ కడుపు నింపే మిల్క్‌బ్యాంకు మంథనిలో లేకపోవడంతో డబ్బా పాలు తప్పడం లేదు. దీంతో పిల్లల్లో ఎదుగుదల క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం ద్వారా మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో తల్లిపాల కేంద్రాలు ఉంటాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు. మంథనిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల కేంద్రం లేకపోవడంతో తల్లిపాలు సరిపోని శిశువులకు ఆస్పత్రిలో పక్కనే ఉండే మరో తల్లి తన బిడ్డకు సరిపడ పాలు ఇచ్చి..మరో బిడ్డకు సైతం పట్టిస్తున్నారు. అలా ఇష్టపడని తల్లుల పిల్లలకు పుట్టగానే డబ్బాపాలను అందిస్తున్నారు. మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్ర వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో నెలలో 10లోపే డెలివరీలు జరుగుతున్నాయి.


